+91 95819 05907

కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఓటర్ కు అందజేస్తాం :రేగా

*మహిళకు యూరియా కట్ట ఇయ్యలేని సర్కార్ మహిళకు కోటి ఇస్తారట*
*బిఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తా జిల్లా అధ్యక్షులు రేగా*
*నేటి గదర్ న్యూస్ గుండాల*
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారెంటీ లతోపాటు 420 హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీల అమలు పరచడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాకీపడ్డ ఆరు గ్యారెంటీల గ్యారెంటీ కార్డును ప్రతి ఓటరుకు అందజేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ మాటలు చెబుతూ కాలం వెళ్ళబుచుతుందని ఆయన అన్నారు గడిచిన 20 నెలలోనే రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి ఏ అభివృద్ధి చేశారు చూపాలని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏ సంక్షేమ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగితే బాకీ పడ్డ సంక్షేమ పథకాలను ఇవ్వాలని ప్రతి ఓటరు అడగాలని అన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పినపాక నియోజకవర్గం కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని క్యాన్సిల్ చేయించారు కానీ కొత్త నిధులను రాబట్టడంలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి చూస్తున్నారని ప్రజలు వాళ్ళ మాయమాటల్లో పడి మళ్లీ ఇబ్బందులకు గురి కావద్దని ఆయన అన్నారు. మహిళలకు యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అనడం ఎంతో ఆశయాస్పదమని ఆయన అన్నారు. రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ రైతు సమన్య సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, పార్టీ సీనియర్ నాయకులు మొత్తం రవి, గడ్డం వీరన్న, ఏడూర్ల బుచ్చి రాములు, కుంజ నాగేశ్వరరావు, తాటి కృష్ణ, మల్లయ్య, జాడి ప్రభాకర్, కుంజ సుధాకర్, పొంబోయిన సుధాకర్, రామటంకి అనిల్, గొగ్గల రాంబాబు, సాయం శ్రీను, సుతారి సత్యం, సిహెచ్ వీరన్న, గంగాధరి ప్రమోద్, మొక్క ప్రశాంత్, గుగులోత్ వీరు, ఈసం సుధాకర్,బుఖ్య శ్రీను, జనగం లక్ష్మయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !