మూడవసారైనా సర్పంచి దక్కేనా..?
ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గ్రామంలో ప్రత్యేక గుర్తింపు..
నేటి గదర్ న్యూస్, వైరా:-
వైరా మండలం ముసలిమడుగు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో ముసలిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సేవకుడు మాజీ ఎంపీటీసీ, తడికమల్ల నాగేశ్వరరావు సర్పంచ్ బరిలో నిలుస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆయన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం..? అనతి కాలం లోనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దగ్గర మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. గ్రామంలో యువ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం కలిగిన నేతగా ప్రత్యేక గుర్తింపు ఆయన సొంతం. రాజకీయ ప్రస్థానం కంటే ముందు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసి గ్రామంలోని ప్రజలకు ఆయన తలలో నాలుకల ఉండేవాడు గ్రామంలో ఆయన తెలియని వారు ఉండరు. తమ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎస్సీకి రిజర్వుడు కావడంతో ఆయన బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన ఆయన గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినారు. అయినా పట్టు వదలక మూడోసారి సర్పంచ్ బరిలో దిగుతున్నారు. ఆయనకు గ్రామ ప్రజల్లో మంచి పట్టు ఉండటంతో పాటు అన్ని విషయాలపై మంచి అవగాహన కలిగిన నాయకుడిగా మృదు స్వభావిగా పేరుపొందారు. గ్రామంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో పాటు, చదువుకున్నవాడు, విజ్ఞుడు ఆయన బరిలో ఉంటే గెలుపు సునాయాసంగా ఉంటుందని ప్రత్యార్థులకు దీటుగా సవాలు విసిరే అవకాశం ఉందని గ్రామంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఏమి జరుగుతుందో వేసి చూడాల్సిందే.









