+91 95819 05907

వృత్తి ధర్మానికి నిలువుటద్దం డీసీహెచ్ఎస్ కేశగాని రాజశేఖర్ గౌడ్.

ఉపాధ్యాయురాలికి ఆపన్నహస్తం — స్వయంగా ఆసుపత్రికి తరలించి చికిత్స పర్యవేక్షణ

తన కారే అంబులెన్స్‌గా మార్చి రక్షణ అందించిన వైద్యుడు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి డీసీహెచ్ఎస్ కేశగాని రాజశేఖర్ గౌడ్. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిని చూసి క్షణం ఆలస్యం చేయకుండా స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. పెద్దగోపతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాధవి సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఖమ్మం బయలుదేరారు. మార్గమధ్యలో వి.వెంకటాయపాలెం గ్రామ స్టేజీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న స్కూటీకి కుక్క అడ్డుగా రావడంతో స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె రక్తమోడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మీ సేవ నిర్వాహకురాలు నాగవాణి వెంటనే సిపిఆర్ చేసి కొంతమేర తేరుకునేలా చేశారు. అదే సమయంలో వైరా వైపు నుంచి కారులో వస్తున్న డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్ సంఘటనను గమనించి తన కారును ఆపి, స్వయంగా ఆమెను కారులో ఎక్కించుకొని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరగానే దగ్గరుండి ప్రధమ చికిత్స పూర్తి చేసి, అవసరమైన వైద్య సేవలు సమయానికి అందేలా పర్యవేక్షించారు. ఆయన వేగవంతమైన స్పందన వల్ల మాధవి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

గతంలోనూ పలు ప్రమాదాలపై స్పందన :

రాజశేఖర్ గౌడ్ కేవలం ఈ ఒక ఘటనలోనే కాకుండా, గతంలో కూడా ఈ ఏరియాలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించారు. కొద్ది నెలల క్రితం ఒక ప్రైవేట్ టీచర్ ఇలానే గాయపడి రోడ్డుపై పడిన సందర్భంలో స్వయంగా కారులో ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాద సంఘటనలో వయోవృద్ధుడికి తీవ్ర గాయాలుతగిలినప్పుడు కూడా తక్షణమే స్పందించి, అవసరమైన వైద్య సహాయం అందించారు. ఈ సంఘటనలు ఆయన తక్షణ, సమర్థ, మరియు మానవతా వైద్య సేవల్లో ముందుంటారని స్పష్టంగా చూపుతున్నాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !