ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు భీమ్‌కు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పూలమాలలు; ఉద్యమ నాయకులు హాజరు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 07: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో దమ్మపేటలో ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. కొమరం భీమ్ ఆశయాలను కొనసాగించాలని, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు పోరాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ నివాళి కార్యక్రమంలో తుడుం దెబ్బ నియోజకవర్గ ఇంచార్జి పర్షిక మారేష్, తంబళ్ల రవి, బండారి సూర్యనారాయణ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సున్నం శ్రీను, ఆదిమ ఆదివాసి సంఘ నాయకులు సోయం రామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు “జై ఆదివాసి… జై జై ఆదివాసి” మరియు “జోహార్ జోహార్ కొమరం భీమ్ కి జోహార్” అంటూ నినాదాలు చేశారు.









