*నేటి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం
ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు తగిన న్యాయం జరిగిందని రాజకీయ నాయకుల విశ్లేషణ
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్ 7.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కల్పించలేని రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి అమలు చేసి చూపిందని రాష్ట్రవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాసంఘాల నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ నాయకులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అవకాశాలు ఉన్నాగాని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తక్కువ ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన విషయం తెలిసిందే రాజకీయ నాయకుల విశ్లేషణ ప్రకారం ఇప్పుడు నా రిజర్వేషన్లు న్యాయపరంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చినయని రాజకీయ నాయకుల విశ్లేషణ.









