+91 95819 05907

ఆ ఇద్దరి ఆశీర్వాదం గౌడ బిడ్డకేనా?కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి గా ఎర్ర సంధ్య సురేష్ గౌడ్ కు ఛాన్స్?

★రామునికి హనుమంతుని వలె ఎమ్మెల్యే పాయం కు నమ్మిన బంటు ఎర్ర సురేష్ గౌడ్

★గతంలో పాయం సూచన తో మండల అధ్యక్ష పదవి త్యాగం

★రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొని ఎమ్మెల్యే పాయం మే ప్రాణంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఎర్ర సురేష్ గౌడ్
★బీ సి మహిళకు జెడ్పీటీసీ కేటాయింపు జరగడం తో ఎర్ర సురేష్ సతీమణి ఎర్ర సంధ్య కు ఆ ఇద్దరి ఆశీర్వాదం ?
★నా కష్టం ను పార్టీ తప్పక గుర్తిస్తుంది:ఎర్ర సురేష్ గౌడ్

నేటి గదర్ న్యూస్,కరకగూడెం:

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కరకగూడెం జెడ్పీటీసీ రిజర్వేషన్ బీ సి మహిళకు రావడం జరిగింది.ఏజెన్సీ లో బీ సి లకు రాజకీయ రిజర్వేషన్లు దక్కడం మండలాల వారిగా రొటేషన్ లో భాగంగా జరుగుతుంది. ఈ దఫా కరక గూడెం మండలానికి బిసి మహిళకు జడ్పిటిసి రిజర్వేషన్లు కేటాయించడంతో తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా మంత్రి పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు నమ్మిన బంటుగా ఉంటున్న చిర్రమళ్ళ వాసి ఎర్ర సురేష్ గౌడ్ సతీమణి ఎర్ర సంధ్య సురేష్ గౌడ్ కు దక్కనుందని ఊహాగానాలు మెండుగా వినపడుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎర్ర సురేష్ గౌడ్ రాజకీయం తొలినాళ్ల నుంచి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నమ్మిన బంటుగా ఉంటున్నారు.తన రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీని గత 15 సంవత్సరాలుగా మంత్రి పొంగిలేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అడుగుజాడలలో నడుస్తున్నాడు. గతంలో ఓ పార్టీ మండల అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆనాడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేను ఉన్నాను అనే అభయం ఇవ్వడంతో ఎర్ర సురేష్ మండల అధ్యక్ష పదవి వదులుకున్నాడు. ఈ క్రమంలో రిజర్వేషన్ రూపంలో మరొక అవకాశం రావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన సతీమణికి జెడ్పిటిసి టికెట్ కేటాయిస్తుందని ఆశాభావంతో ఉన్నాడు. కరక గూడెం మండలంలో గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, అనేక ఏళ్లుగా ఎమ్మెల్యే పాయంకు నమ్మిన బంటుగా ఎర్ర సురేష్ గౌడ్ ఉండడంతో జడ్పిటిసి కాంగ్రెస్ టికెట్ ఆయన సతీమణికే దక్కుతుందని కరకగూడెం మండల వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎర్ర సంధ్య కి టికెట్ అంటూ జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం ఆశీర్వాదం ఎవరికి దక్కనుందో అతి త్వరలోనే తేల నుంది. ఎర్ర సురేష్ గౌడ్ మాత్రం జెడ్పిటిసి టికెట్ విషయమై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !