క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నాం
– కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
పినపాక
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . మంగళవారం పినపాక మండలం ఎల్జిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు 30 కుటుంబాలు పైగా చేరారని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంక నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు









