– జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షులు శ్రీను
పినపాక
ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల విగ్రహానికి జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు కొమరం శ్రీను మాట్లాడుతూ కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటమన్నారు. ఆదివాసీ గుడాల్లో తమ రాజ్యం కావాలని మా అడవుల మీద మాకు హక్కు ఉండాలని పోరాటం చేశారని అని గుర్తు చేశారు.
వారి పోరాటాల ఫలితంగానే ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారని తెలిపారు. మైదాన ప్రాంత రాష్ట్రాల్లోని ఆదివాసీల పరిరక్షణ కోసం షెడ్యూల్ 5ను రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. ఐటీడీఏ ఏర్పాటులోనూ కొమరం భీం స్ఫూర్తి ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధితోనే కొమరం భీం ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు , ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు









