కనకరాజు బంధువులకు ఆర్థిక సహాయం.
నేటి గదర్ న్యూస్, సింగరేణి:-
సింగరేణి గ్రామపంచాయతీ లో నిరు పేదల కుటుంబాలకు నేనున్నానంటూ మీకేం కాదంటూ సేవకుడైన షేక్ గౌసుద్దీ న్, మంగళవారం మూసుకుల కనకరాజు, వారి కుటుంబానికి ఆర్థిక . సాయం నగదు,5000 రూపాయలు అందజేశారు.
మండల కేంద్రం పాత టీచర్ కాలనీ కు చెందిన ముసుకుల కనకరాజు అనారోగ్యంతో గత వారం క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న షేక్ గౌ సుద్దీన్ ముసకుల కనకరాజు దశదిన కార్యక్రమ నిమిత్తము వారి కుటుంబానికి ముసకుల కనక రాజు కు చెందిన బాధిత కుటుంబానికి చేయూతను అందించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కనకరాజు కుటుంబం నిరాశ్రయు లైన . బాధితులకు అండగా నేనున్నానంటూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఓదార్పు దయచేయాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్దకు వెళ్లి , ఆపద సమయంలో మానవత్వం చాటి మంచి మనసున్న మనిషిగా మాకు చే యుతనందించినందుకు గాను ఆ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డొంకిని రవీందర్ గౌడ్ అబ్దుల్ వాహె అజార్ సద్దాం ముస్తాక్ ఆనందరావు సతీష్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.









