+91 95819 05907

పొన్నం మౌనం వహిస్తే అణగారిన వర్గాల ఐక్యతకు భంగం కలుగుతుంది :ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.*

*పొన్నం మౌనం వహిస్తే అణగారిన వర్గాల ఐక్యతకు భంగం కలుగుతుంది.*

*సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ పైన జరిగిన దాడిని ఖండిస్తున్నాం.*

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.

నేటి గదర్ మెదక్ హైదరాబాద్ న్యూస్ (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 7.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీటిలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన కట్లూర్ లక్ష్మణ్ ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తప్పు జరిగింది వాస్తవమేనని అంగీకరించి పొన్నం ప్రభాకర్ చేత క్షమాపణ చెప్పించే విధంగా చూస్తామని తెలిపారని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణను తీసుకోవలసి వస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు. ఆత్మగౌరవ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు అనే విషయం స్పష్టం చేశారు.
కార్యక్రమం మైనార్టీ వర్గాలకు చెందిన ఆయనప్పటికీ ఆ శాఖ మంత్రిగా అట్లూరు లక్ష్మణ్ కుమార్ ఉండగా వాటి మీద పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం ఎందుకు అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్న వివేక్ జోక్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే పొన్నం సహించగలుగుతాడా అలాగే కార్మిక శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి సహించగలుగుతారా తెలుసుకోవాలని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ని దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌనంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందని అన్నారు నిజంగా వివేక్ లో దళిత సృహ ఉంటే సాటి దళిత మంత్రిని అలా అనకూడదని వెంటనే ఖండించాల్సిన అవసరం ఉండేది కానీ వివేకలో ఆస్పృహ లేదని అర్థమైంది. వివేక్ వెంకటస్వామి మాదిగలను పోర్చుకోలేకపోతున్నాడని అన్నాడు. కాక జయంతి వేడుకల్లో అన్ని వర్గాలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వివేక్ లో దళిత సుహా సోదర సోదర కనుమరుగైందని అన్నారు. ఉమ్మడిగా దళితులకు రావలసిన హక్కులను సాధించడం కోసం అందని కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న వివేక్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడని అన్నారు.
బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగజాతి సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతుందని అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతించినట్లుగానే బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని పిలుపునిచ్చారు.అలాగే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపతశక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని స్థానంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ,రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ,జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ,జాతీయ కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ మాదిగ,రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ కుమార్ మాదిగ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జన్నపాల మహేష్ మాదిగ,సీనియర్ నాయకులు ఏడవెల్లి అజయ్ మాదిగ,ప్రధాన కార్యదర్శి దావు ఆదిత్య మాదిగ,మంద అనీల్ మాదిగ,మహేంద్ర మాదిగ,మామిడి ప్రశాంత్ మాదిగ,రవి కుమార్ మాదిగ,అజయ్ కుమార్ మాదిగ,కొమ్ము తిరుపతి మాదిగ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !