ఒకే ఏడాదిలో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన ముస్లిం యువతులు.
*ఎంబిబిఎస్ సీట్లు సాధించిన సమీనా, ఆయోషా కు ఘనంగా సన్మానించిన ముస్లిం పెద్దలు*
నేటి గదర్ కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ యువతులు ఓకే సంవత్సరంలో ఇద్దరు ఎంబిబిఎస్ కోర్సులలో ఎంపిక కావడం ఆనందకర విషయం వేరులో ఒకరు కరకగూడెం ఆర్ఎంపీ డాక్టర్ మొహమ్మద్ రఫీ కూతురు మొహమ్మద్ ఆయోషా,మరొకరు సయ్యద్ సజ్జాద్ హుస్సేన్ కూతురు సయ్యద్ సమీనా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఎంబిబిఎస్ సీట్లు సాదించిన వారి తల్లిదండ్రులకు పూలమాలలు వేసి శాలువతో సత్కరించి సన్మానంచేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లీం మైనార్టీ పెద్దలు,మస్జిద్,ఇమామ్ సాబ్,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 69









