*మాజీ ఎంపీపీ ముక్తి సత్యం*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, శాస్త్రీయ విద్య విధానానికై విద్యార్థిలోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం అధ్యక్షులు మాజీ ఎంపీపీ ముక్తి సత్యం విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో పి డి ఎస్ యు గుండాల మండల మహాసభ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. విద్యార్థి లోకం శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతూ అడుగులు వేయాలని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశ నుండే అవలంబించుకోవాలని ఆయన కోరారు. అణచివేతకు వ్యతిరేకంగా 50 ఏళ్లుగా విరామం లేకుండా పి డి ఎస్ యు పోరాటాలు చేస్తుందని అన్నారు. నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందని అన్నారు. పాలకులు దీనిపై దృష్టి సారించి విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల మాజీ సర్పంచ్ కోరం సీతారాములు, పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, నాయకులు భాస్కర్, ప్రేమ్, లోకేష్, భాస్కర్, షాహిద్, రాహుల్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు









