పినపాక
పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీలోని తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందించి పినపాక మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు మానవత్వం చాటుకున్నారు. సోమవారం మల్లారం గ్రామంలో గల
అనాధ పిల్లలు పూణెం శంకర్ (15), పూణెం లలిత (14), పూణెం రామకృష్ణ (12), పూణెం కార్తీక్ (10)లకు ఒక్కొక్కరికి రూ. 4,000 నగదు , 25 కేజీల బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి అనాధ పిల్లలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.
Post Views: 61









