గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
జన్నారం పాఠశాలలో జివి రామన్ జన్మదిన వేడుకలు
నేటి గదర్ న్యూస్, వైరా/ ఏన్కూర్:-
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూత అందించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మార్పు స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు దంపతుల పెద్ద కుమారుడు గుడిమెట్ల వెంకట రామన్ జన్మదినాన్ని మంగళవారం ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. జన్నారం ఎంపిపిఎస్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, వసతులు ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. చదువును కొనుక్కోలేని నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, పేద విద్యార్థుల చదువుకు చేయూత అందించాలని, బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు నిలయాలైన ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తూము సుధాకర్, జన్నారం మాజీ ఉప సర్పంచ్ అడపా రామారావు, గార్లఒడ్డు సొసైటీ ఉపాధ్యక్షులు రేగళ్ల తిరుమలరావు, రైతు సంఘం మండల నాయకులు నేలపట్ల బాబు, పచ్చకాయల వెంకన్న, సంపసాని వెంకటేశ్వర్లు, జన్నారం ఎంపిపిఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సాధం దివ్య, ఉపాధ్యాయురాలు కుదురుపాక నాగమణి, అంగన్వాడీ టీచర్ సరస్వతి, మార్పు స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల వెంకట రమణ, గుడిమెట్ల తిరుపతయ్య, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.









