+91 95819 05907

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలి… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

*క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలి… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ*
—————————–
ఖమ్మం :
—————————–
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. *కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై అధికారులతో సమీక్షించారు.*
ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ* క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ క్రింద జిల్లాలో అనుమతులు, రెన్యువల్స్ కోసం వచ్చిన దరఖాస్తులలో ఆమోదించినవి, తిరస్కరించిన, పెండింగ్ లో ఉన్న వాటిపై వైద్య అధికారులతో సమీక్షించారు.
*క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని అన్నారు.* ఆసుపత్రులను సీజ్ చేసిన తర్వాత కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులలో సరైన ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు. *కౌంటర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, సిపి, లా అండ్ ఆర్డర్ డిసిపి అభిప్రాయం తీసుకుని పక్కాగా ఉండేలా దాఖలు చేయాలని అన్నారు.* జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన పరికరాల కొనుగోలు నిబంధనల ప్రకారం జరగాలని, పరికరాలను నేరుగా నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని, పెద్ద యంత్రాలు కొనుగోలు ఈ ప్రొక్యూర్ మెంట్ చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ ప్రసాదరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి, డిప్యూటీ డి.ఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందునాయక్, ఐఏంఏ అధ్యక్షులు డా. రెహానా బేగం, ప్రోగ్రాం అధికారులు వెంకట రమణ, రామారావు, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. నరేందర్, డి.సి.హెచ్.ఎస్. డా. రాజశేఖర్ గౌడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !