పినపాక
పినపాక.మండల పరిధి లోని గోపాల్రావ్‌పేట గ్రామానికి చెందిన ఎన్నారై కునారపు ప్రసాద్ అన్న కూరారపు మోహన్‌రావు గుండెపోటుతో మరణించారు . ఈ విషయం తెలుసుకున్న మాజీ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం గోపాలరావుపేట గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మోహన్ రావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మాజీ ఎంపీటీసీ సత్యం, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తిబాబు, పార్టీ సీనియర్ నాయకులు వాసు బాబు, భవాని శంకర్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 187









