* నేను “పెద్దపెల్లి”నీ మాట్లాడుతున్న..
గాయాలను,గతాలను తలుచుకుంటుంటే దుఃఖ మోస్తున్నది బిడ్డ.
“జగిత్యాల జైత్రయాత్ర” నుంచి జంగల్ మహల్ దాకా ఎన్నెన్ని నెత్తుటి త్యాగాలు.
ఆదివాసి బిడ్డలకు అడవి తల్లి ఓడిలో వెలిగించిన అక్షర దీపాలై..
సమిష్టి వ్యవసాయాన్ని నేర్పుతున్నారని తెలిసి సంబరపడ్డ బిడ్డ.
నేను పెద్దపల్లి ని మాట్లాడుతున్న
నడిపపోడు “కోటన్న” అడవి తల్లి ఓడిలో కన్నుమూసిండని తెలిసి కడుపునిండా చిరునవ్వై పలకరించే వాని నవ్వులు త్యాగాలు తలపోసుకుంటా వాని నవ్వులు యాది కొచ్చి దుఃఖపడుతున్న..
చిన్నోడా..!
దేశానికి వెలుగు చూపే దీవిటిలైతరనుకునీ మస్తు సంబరపడ్డ..
అడివి తల్లి ఒడిలో నిప్పు పెట్టిన నీ నవ్వులు చూస్తుంటే కొడుకా నాకు అంతులేని దుఃఖంమోస్తుంది బిడ్డ.
అవును బిడ్డ నేను పెద్దపెల్లి ని మాట్లాడుతున్న.
నువ్వు ఎట్లున్నవని నేను అడుగ జీవితమంతా నువ్వు పోరూ కే దారపోస్తావ్ అనుకున్నా.
చివరాఖరున పీడితులకు ధైర్యంమై నిలబడాల్సిన నువ్వే పాలకుల వెంట నిలబడి విషపు నవ్వులు నవ్వుతుంటే భయమైతుంది బిడ్డ.
బిడ్డ నేను పెద్దపల్లి ని మాట్లాడుతున్న కొంగు చాటున వెక్కిళ్ళను దాచుకుని దుఃఖపడుతున్నా.









