+91 95819 05907

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలి… మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలి… మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు.

48 నుంచి 72 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో ధాన్యం సొమ్ము జమ.

8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

ప్రణాళికాబద్ధంగా వరి కోతలు జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి

ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రులు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో వానాకాలం పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి హైదరాబాద్ నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశ చరిత్రలో అత్యధికంగా వరి పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు. రాబోయే వానా కాలం అత్యధికంగా పంట కొనుగోలు తెలంగాణ రాష్ట్రం చేయబోతుందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ధాన్యం రవాణా కాంట్రాక్ట్ ఖరారు చేసే ముందు సరిపడ వాహనాలు సరఫరా చేసేందుకు అర్హత ఉందో లేదో ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని మంత్రి సూచించారు. జిల్లాలో వరి కోతలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు, గన్నిబ్యాగులు, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, కొనుగోలు సిబ్బందికి అవసరమైన మేర శిక్షణ అందించాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదురు చూసే పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్ ఎంట్రీ జరిగేలా సిబ్బంది నియమించుకోవాలని, 2025 వానాకాలం సీజన్ నందు ధాన్యం డబ్బులు 48 నుంచి 72 గంటలలోగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు బాగా జరుగుతుందని ప్రభుత్వానికి మంచి పేరు ఉందని, గత రెండు సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్ మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోలు చేసేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను వరి కోతల కంటే ముందుగానే ప్రారంభించాలని అన్నారు.దీపావళి తర్వాత వరి కోతలు వేగం కానున్న నేపథ్యంలో జిల్లా గన్ని బ్యాగులు, ధాన్యం రవాణా ఏర్పాట్లు, ధాన్యం సెంటర్ లలో ఇన్ ఫ్రా సౌకర్యాల కల్పన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రమ పద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చూడాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు క్రమ పద్ధతిలో జరిగేలా జిల్లాల్లో ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు.
2025 వానాకాలంలో మన దగ్గర 66 లక్షల 80 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతోందని, కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నుల (40 లక్షల సన్న రకం, 40 లక్షల దొడ్డు రకం రకం) ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒకే చోట కొనుగోలు చేస్తే రైతులకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని, సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా రవాణా చేయాలని అన్నారు. వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్ లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని అన్నారు. టార్ఫాలిన్ కవర్లు ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో పెట్టాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని ‌అన్నారు. జిల్లాలో ఉన్న గ్రామ పరిపాలన అధికారులకు కొనుగోలు కేంద్రాల వద్ద విధులు కేటాయించాలని, దీనికి సంబంధించి ప్రోసిడింగ్స్ జారీ చేయాలని, గ్రామ పాలన అధికారుల ద్వారానే రిపోర్ట్ సేకరణ ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులను ముందస్తుగానే అందుబాటులో ఉంచాలని, 10 లక్షల గన్ని బ్యాగుల అదనపు కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అధికారులు తన దృష్టికి తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ త్వరగా జరగాలని, రైస్ మిల్లుల, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర హమాలీలు అందు బాటులో ఉండాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రతిరోజు క్షేత్ర స్థాయి పురోగతి వివరాల రిపోర్టు రూపంలో అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, జిల్లా రవాణాధికారి వెంకటరమణ, జిల్లా సహకార అధికారి గంగాధర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !