అగ్రిమెంట్ లేకుండా విత్తనం మొక్కజొన్న వేసుకోవద్దు.
మండల వ్యవసాయ అధికారి బాలాజీ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
కొణిజర్ల మండలం లో విత్తనం మొక్కజొన్న ఏజెంట్స్ గ్రామాలలో తిరిగి విత్తనం మొక్కజొన్న వేపించటానికి ముందుగా కొంత పెట్టుబడి కి అని రైతులకు 20000 నుండి 30000 వరకు రైతులకు ఇచ్చి రైతులను వారి రైతులుగా నమోదు చేసుకుంటున్నారు, గత సంవత్సరాం కొందరు ఏజెంట్స్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా కంపిని నుండి వారికీ రావలిసిన డబ్బులు తీసుకొని రైతులను చాలా ఇబంది పెట్టారు మళ్ళీ ఈ సంవత్సరాం మళ్ళీ విత్తనాల ఏజెంట్స్ గ్రామాలలో తిరుగుతున్నారు అని మాకు తెలుస్తుంది, ఈ సంవత్సరాం వర్షాలు ఎక్కువ పడటం వలన పెసర,ప్రత్తి ఆశించినంత దిగుబడులు రాకపోవటం వలన విత్తనం మొక్కజొన్న వేసుకొని ఎక్కువ దిగుబడి సాదించాలి అని కొందరు రైతులు ఆలోచిస్తున్నారు, అదే ఆసరాగా భావించి అమాయక రైతులకు ఎక్కువ దిగుబడి వస్తాయి మా కంపినీ మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటే అని మరియు పురుగు మందులు మేమే ఇస్తాము, పెట్టబడి మేమే ఇస్తాము అని రైతులకు ఆశ చూపి విత్తన మొక్కజొన్న వేపిస్తారు, మాములు మొక్కజొన్నతో పోలిస్తే విత్తనం మొక్కజొన్నకు పెట్టుబడి ఎక్కువ మరియు రైతులకు ఇచ్చే పురుగు మందులు మన దెగ్గర కాకుండా ఎక్కడ నుండో తీసుకొని వస్తారు చిన్న చిన్న కంపినీలవి మరియు బయో పురుగు మందులు ఇచ్చే అవి 2000 అయితే 5000 అని చెపుతారు బిల్స్ కూడా కొంత మంది రైతులకు ఇవ్వరు, ఇలా రైతును వితనాలు ఇచ్చిన దెగ్గర నుండి చివరి వరకు అన్ని ఎక్కువ ధరలు రాసి మొత్తం మొక్కజొన్న కోసిన తరువాత 5 నుండి 10 క్యూటల్ వస్తే రైతుకు ఏమి మిగులు తుంది, గత సంవత్సరాం కంటే ఈ యేసంగి కి ఇంకా ఎక్కువ విత్తన మొక్కజొన్న వేపించ టానికి లోకల్ ఏజెంట్స్ కాకుండ బయట ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి గ్రామాలలో తిరుగు తున్నారు వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలిసిన వాడా కదా ఆలోచించ కుండా కొందరు అమాయక రైతులు వారి ప్రలోభాలకు లొంగి విత్తన మొక్కజొన్న వెయ్యటానికి రడీగా , గత సంవత్సరాం అన్ని విత్తన కంపినిస్ వారు టార్గెట్ కంటే ఎక్కువ విత్తన మొక్కజొన్న వెయ్యటం వలన వారి గోదాంమ్ లు కూడా నిండి పోయాయి అని అన్నారు, మళ్ళీ రైతులు విత్తన మొక్కజొన్న వేస్తే కంపిణీలు తీసుకుంటుందా లేదా మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ వున్న ఏజెంట్స్ చేసేది ఏమి లేక రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎలా కూడా రైతులు నష్ట పోతారు, విత్తన మొక్కజొన్న వేసిన రైతు పొలానికి 500 మీటర్స్ వరకు నాటు మొక్కజొన్న వెయ్యకూడదు ఎవరు అయినా వేస్తే ఇద్దరు రైతుల మొక్కజొన్న దిగుబడులు తగ్గుతాయి అన్న విషయం కొందరు మొక్కజొన్న ఏజెంట్స్ కు ఈ విషయం కూడా తెలియదు,కొందరు రైతులు అనుభవం వున్న ఏజెంట్స్ నా మరియు మొక్కజొన్న పంట కోత తరువాత వారం రోజులలో డబ్బులు ఇచ్చే వారా అని కూడా తెలుసుకోకుండా విత్తనం మొక్కజొన్న వేస్తున్నారు, మళ్ళీ కొందరు ఏజెంట్స్ రైతు దెగ్గర మాత్రం అగ్రిమెంట్ తీసుకుంటారు ఏమని అంటే నువ్వు పండించిన మొక్కజొన్న నాకే ఇవ్వాలి నాకు కాకుండా వేరే వారికీ ఇస్తే చట్ట పరంగా మీ మీద పిర్యాదు చేస్తాము అని అదే విదంగా రైతుకు కూడా నాకు నష్టం వస్తే కంపెనీ నాకు నష్ట పరిహారం ఇవ్వాలి అని రైతుకి కూడా అగ్రిమెంట్ ఇవ్వాలి కానీ రైతు దెగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారు కానీ రైతుకు ఇవ్వటం లేదు రైతుకి కూడా అభయం ఇవ్వాలి గా ఆలా ఇవ్వకుండా తక్కువ దిగుబడి వస్తే రైతుని పటించుకొక పోవటం రైతు నష్ట పోతున్నారు, కొందరు ఏజెంట్స్ మొక్కజొన్న కోత తరువాత 10 రోజులలో వారికి డబ్బులు ఇవ్వాలి కానీ నెలలు నెలలు వారిని తిప్పుకొని డబ్బులు ఇచ్చారు, రైతులకు వ్యవసాయ శాఖ నుండి ఒకటే విన్నపము అగ్రిమెంట్ ఇస్తే విత్తనం మొక్కజొన్న వేసుకోండి లేదా నాటు మొక్కజొన్న వేసుకోండి ఈ రోజు అమ్మపాలం లో బానోతు సింగ్ విత్తన మొక్కజొన్న వేసే విధానం పరిశీలించటం జరిగింది, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ మరియు రైతు పాల్గున్నారు
ఏజెంట్స్ పాటించు వలిసిన నియమాలు.
1) ఏజెంట్ తప్పకుండా లోకల్ వారు అయి ఉండాలి
2) విత్తనాలు వేసే టప్పుడు మీ కంపినీ సిబంది దెగ్గర ఉండి విత్తనాలు వేపించాలి
3) వారానికి ఒకసారి రైతు పొలం దెగ్గరకు వెళ్లి సలహాలు చూచనలు ఇవ్వాలి
4) పొలం లో ఏమయినా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి అంటే రైతుకి వెంటనే చెప్పి చేఇంచాలి
5) డీ టాసాలింగ్ సమయాణికు చేపించాలి,లేకపోతే దిగుబడులు సగానికి సగం తగ్గుతాయి, రైతు నష్ట పోతారు
6) రైతులకు ఇచ్చే కలుపు మందులు పురుగు మందులు తప్పకుండా లోకల్ వున్న పురుగుమందుల షాప్ ల వద్ద మాత్రమే తీసుకోవాలి లేదా మీరే పురుమందుల లైసెన్స్ తీసుకొని రైతులకు ఇవ్వవచ్చు
7)రైతుల నుండి మీరు అగ్రిమెంట్ ఎలా తీసుకుంటున్నారో అలాగే రైతుకి కూడా తప్పకుండా అగ్రిమెంట్ ఇవ్వాలి
8) వ్యవసాయ పట్టు భద్రులను నియమించుకొని రైతులకు ఎప్పటి కప్పుడు సలహాలు ఇవ్వాలి
9) రైతుల పంటకోత తరువాత ఎంత దిగుబడి వచ్చినది అన్న రసీదు ఇచ్చిన 10 రోజుల లోపు రైతుకు ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలి
10) ఏజెంట్స్ రైతుకు నష్టం జరిగే పని ఏమి చేసిన చట్ట పరంగా వారి మీద చర్యలు ఉంటాయి అని మండల వ్యవసాయ అధికారి బాలాజీ తెలిపారు.









