అసలేం జరిగింది ?
డెక్కన్ సిమెంట్స్ వ్యవహారమేంటీ ?
అందులో రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి..
వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పాత్రలేంటీ ?
రోహిన్ రెడ్డి ఆఫీసులో సిట్టింగ్ జరిగిందెప్పుడు ?
అసలు ఈ వ్యవహారంలో..
సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ?
భారీ ఎత్తున ముడుపులు, ఆర్థిక లావాదేవీలు జరిగాయా ?
అసలు కథేంటీ ?
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు, అరెస్టు వార్తల ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించారు ? ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు ? బుధవారం అర్ధరాత్రి దాకా కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ ఇద్దర పోలీసుల హడావిడి ఏంటీ ? ఎవరి ఆదేశాల మేరకు కొండా సరేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ? వీటన్నింటికి సమాధానాలు కావాలంటే… మనం ఒక ఏడాది క్రితం జరిగిన కొన్ని హిడెన్ విషయాలు తెలుసుకోవాలి. అసలేం జరిగిందీ అని తెలుసుకునే ప్రయత్నం చేయడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అధికారం అండతో రెచ్చిపోయిన ఓ భారీ సెటిల్మెంట్ల దందా వ్యవహారం బట్టబయలైంది.
అసలేం జరిగిందంటే..
ఏడాది కింద (రేవంత్ రెడ్డికి సంబంధించిన) బిగ్ టీవీలో డెక్కన్ సిమెంట్స్ లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని వరుస కథనాలు వచ్చాయి. అసలు ఏం జరిగిందో కనుక్కోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యఅనుచరుడు అయిన రోహిన్ రెడ్డికి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అప్పుడు రోహిన్ రెడ్డి.. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అయిన సుమంత్ ను తన ఆఫీసుకు పిలిపించాడు. సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ కొండా సురేఖ దగ్గరే ఉంది. కాబట్టి సురేఖ ఓఎస్డీ సుమంత్ ను రోహిన్ రెడ్డి పిలిచారు. సుమంత్ ను పిలిచినట్టే డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధి ఒకరిని కూడా పిలిచాడట రోహిన్ రెడ్డి. అయితే.. సుమంత్ మాత్రం డెక్కన్ సిమెంట్స్ కు సంబంధించిన అక్రమాల చిట్టా మొత్తం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ రెడ్డికి తెల్వడంతో విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారట. మీకు ఏమైనా అనుమానం ఉంటే పోలీస్ కంప్లైట్ ఇవ్వండి అని అప్పుడే సీఎం చెప్పినట్టు సమాచారం. (డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ఉత్తమ్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయినట్టు సమాచారం). అది అక్కడితో ఆగిపోయింది.
అయితే.. రీసెంట్ గా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖలో కొన్ని టెండర్లను.. దాదాపు రూ.70 కోట్ల విలువైన టెండర్లను మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకున్నాడు. ఆ విషయం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదు. అయితే.. ఆమె ఓఎస్డీ సుమంత్ ఆ జీవోలు పేపర్లు అన్నీ తిరగేసి మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి ఆయన మనుషులకు ఆ టెండర్లు ఇప్పించుకున్నట్టు సురేఖకు చెప్పాడట. దీంతో ఆగ్రహానికి వచ్చిన సురేఖ.. మొదట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. అయినా ఫాయిదా లేకపోవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్లో కంప్లైట్ చేసింది. ఇదంతా మీడియాకు లీకైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా.. సోషల్ మీడియాలో అంతా రచ్చ రచ్చ అయింది. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
కానీ, కొండా సురేఖకు తెలియని విషయాన్ని చెప్పి లేని పెంట పెట్టిన ఓఎస్డీ మీద కోపానికొచ్చిన మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి… ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఎస్డీ సుమంత్ పై వేటు వేసినట్టు సమాచారం. అంతేకాదు.. ఏడాది కింద డెక్కన్ సిమెంట్స్ ఇష్యూలో అతను బెదిరింపులకు పాల్పడ్డాడని, పాయింట్ బ్లాంక్ లో పెట్టి ఎక్స్ టార్షన్ చేశాడని కేసు నమోదు చేయించినట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే బుధవారం సాయంత్రం నుంచే కొండా సురేఖ కూతురు సుష్మిత ఇంటి దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మఫ్టీలో పోలీసులు ఉన్నట్టు వీడియోలు బయటికి వచ్చాయి. సుష్మిత సీరియస్ అవ్వడంతో ఫస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయిన పోలీసులు.. కాసేపటి తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరికొంతమంది పోలీసులు, కొందరు మహిళా పోలీసులు కూడా వచ్చారు.
అయితే సుమంత్ ను అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఐజీకి కాల్ చేసినట్టు సమాచారం. ఆయన రెస్పాండ్ కాకపోవడంతో.. అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైట్ ఇచ్చాడా లేదా అని చాలాసార్లు ఫోన్లో ట్రై చేస్తే… ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. చాలాసేపటి తర్వాత మళ్లీ కాల్ బ్యాక్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… తానెలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినట్టు సమాచారం. దీంతో వెంటనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి విషయమంతా చెప్పిందట కొండా సురేఖ. నేను చూసుకుంటానులే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టిన మహేష్ కుమార్ గౌడ్… కొద్ది సేపటి తర్వాత ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడితే… ఏ.. అదో చిన్న కేసులు ఏదో ఫార్మాలిటీకి అలా అరెస్ట్ చేసి వదిలేస్తారులే… అని చాలా సింపుల్ గా పీసీసీతో చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
టార్గెట్ కొండా సురేఖ – మురళి!
ఎక్స్ టార్షన్ కేసులో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేసి, తర్వాత ఆ కేసులో కొండా మురళిని ఇరికించి, దాన్ని సాకుగా చూపించి మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని చూస్తున్నారని కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ సంచలన ఆరోపణలు చేసింది. ఎందుకంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతుల రాజకీయ డామినేషన్ ను ఇటు రెడ్డి ఎమ్మెల్యేలు గానీ, అటు కడియం శ్రీహరి కానీ, వేం నరేందర్ రెడ్డి గానీ.. ఎవరూ భరించలేకపోతున్నారు. కాబట్టి.. ఈ ఎక్స్ టార్షన్ కేసులో ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేస్తే… కొండా సురేఖ, మురళీని కూడా కంట్రోల్ చేయొచ్చని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని సురేఖ కూతురు సుష్మిత ఆరోపిస్తోంది.









