కిషోర్ రాజేష్ న్యాయవాదిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి.
ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షుడు కొలుపుల రామస్వామి.
నేటి గదర్ మెదక్ జిల్లా న్యూస్ ( భూపాల్ మాదిగ ) అక్టోబర్ 17.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మండల కేంద్రంలోఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు. చేగుంట తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు చేగుంట మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం నాడు చేగుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అద్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలకు ఇష్టం లేదని అందుకే ఈ దాడికి పాల్పడ్డారు అని అన్నారు. ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు యావత్తు న్యాయ వ్యవస్థ, దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటాం అన్నిటికన్నా భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది. అని అన్నారు. ఈ ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం చేగుంట మండల తహసీల్దార్ కార్యలయం లో ఆర్ ఐ జై భారత్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల చేగుంట మండల అధ్యక్షులు
కొలుపుల రామస్వామి మాదిగ, కోశాధికారి బక్క సాయిబాబా మాదిగ,యపార్ల నర్సింలు, పోట్టి గణేష్, పట్నం అశొక్,బైరి సత్యం తదితరులు పాల్గొన్నారు.









