ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీసీ సంఘాల బందులో పాల్గొని విజయవంతం చేయాలి : వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ, బిజెపి పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా బిసి సంఘాలు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు. రేపటి తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు సంపూర్ణ మద్దతు తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రేపటి బంద్ ను విజయవంతం చేయాలని ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.









