నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి ( భూపాల్ మాదిగ )
సెప్టెంబర్ 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయి పేట మండల గోపాల కృష్ణాపురం గ్రామం లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది అని పశు వైద్యాధికారి డాక్టర్ కావ్య తెలిపారు. ఏడవ విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా మండలంలోని అన్ని గ్రామాలలో టీకాలు వేయడం జరుగుతుంది. డాక్టర్ కావ్య మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకిన పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది అన్నారు. రైతులు ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి పశు వైద్య అధికారుల సలహాలు తీసుకుంటే పశువులను రక్షించుకోవచ్చని ఆమె అన్నారు. అన్ని గ్రామ రైతులకు గడువు తేదీ లోపల టీకాలు వేస్తామని,పశువులు ఉన్న ప్రతి రైతు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Post Views: 87









