పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక &విద్యుత్, ప్రణాళిక. శాఖ మాత్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు రైల్వే కాలనీ గ్రామ పంచాయతీ భవనం కొరకు 20 లక్షల రూపాయల నిధులతో మంజూరైన పంచాయతీ భవనానికి మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ & మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో. పంచాయతీ శాఖ ఏ ఈ రఘు, గ్రామ సెక్రెటరీ ఉపేందర్,రైల్వే కాలనీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపెల్లి శేషగిరిరావు, నాగులవంచ గ్రామ శాఖ అధ్యక్షులు కంభం వీరభద్రం,సిపిఎం గ్రామ కార్యదర్శి బండి నరేష్, మాజీ వార్డ్ సభ్యులు గంధం వెంకటరత్నం, గంట నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31









