*గుండాల ఎస్సై సైదా రహోగ్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలంలో ఎవరైనా నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై
సైదా రహూఫ్ రావు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కిరాణా షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిరాణా షాపుల్లో చిల్లర దుకాణాల్లో నిషేధిత గంజాయి, గుట్కా, కైని, జరదా వంటి పొగాకు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని ఇప్పటికైనా ఎవరైనా విక్రయిస్తే మానుకోవాలని ఆయన సూచించారు. నిషేధిత వస్తువులు విక్రయించే వారిపై సి ఓ టి పి ఏ, ఎన్ డి పి ఎస్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Post Views: 23









