జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ లో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు..ఈ సందర్భంగా ఇంటి ఇంటికి వెళ్లి డోర్ పోస్టర్లను అతికించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరించారు..జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని, నవీన్ యాదవ్ గారికి మీ విలువైన ఓటుతో ఆదరించాలని ఓటర్లను కోరారు..
Post Views: 63









