డిప్యూటి సిఎం నా మనవి ఆలకించండి
రోడ్డు పేరుతో నా పొలంలోకి నీళ్లు మళ్లింపు
ఎంతో మంది భూస్వాములు దగ్గర ఉండి నా ఎకరం పొలం లోకి నీళ్లు మళ్ళిపు
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి.
అయ్యా నేను అనగా పర్చగాని ఉమారాణి w/o రఘుపతి
చిన్నమండవ గ్రామం రెక్కాడితె కానీ డొక్కాడని పేద కుటుంబం నాకు ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు
నాకు చిన్న మండవ గ్రామంలో ఒక ఎకరం పొలం కలదు. యిట్టి పొలం చిన్నమండవ నుండి తిమ్మినేని పాలెం వెళ్ళుటకు గల రోడ్డుకు కుడి ప్రక్క కలదు. ఎడమ ప్రక్క వున్న కొందరు భూస్వాములు తమ పొలంలోని వర్షపు నీటిని పక్కన ప్రవహించే మున్నేరు లోకి మళ్ళించకుండా నాకున్న ఎకరం పొలంపై కన్నేసి దానిని ఆక్రమించుకోనే కుట్రలో భాగంగా దౌర్జన్యంగా కల్వర్ట్ కట్టి నన్ను నష్ట పెట్టాలని చూశారు. ఈ విషయాన్ని సంబధింత అధికారులకు తేలియజేయగా వారు వచ్చి కల్వర్ట్ ను రద్దుపరిచారు. అయినప్పటికి ఈ రోజు నాపొలం వద్దకి JCB &200 మిషన్ లు తీసుకొచ్చి అడ్డుగా వెళ్ళిన నన్ను నెట్టి , కొట్టి భౌతికంగా గాయపరిచినారు. అధికారులకు సమాచారం యిచ్చిన ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పొలంలో పండిన పంట తోనే నేను నా కుటుంబము జీవనం కొనసాగిస్తున్నాము. కావున దీనిపై గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్య మంత్రి వర్యులు వెంటనే స్పందించి నాకు, నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను….









