+91 95819 05907

గుంతల రోడ్లపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆగ్రహం

గుంతల రోడ్లపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆగ్రహం

ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్‌ఎస్ నేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా, అంకంపాలెం దాటిన తరువాత రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణానికి అంతరాయం కలిగింది. అడుగడుగునా ప్రమాదకరంగా మారిన రోడ్డును గమనించిన ఆయన గంగారం వద్ద కారు దిగి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడగా మంగళవారం రాత్రి కూడా ఈ గుంతల కారణంగా ప్రమాదం జరిగిందని, ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు ఇచ్చిన ‘గుంతలతో సెల్ఫీ’ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రోడ్డు గుంతలతో సెల్ఫీ దిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్ల మరమ్మతులపై పెట్టాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఒక్క తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజల ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారా?” అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప, కొత్తగా ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరై మొదలైన పనులను సైతం గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు మళ్లీ గెలవడం కష్టమని తెలిసి, ప్రజల గురించి పట్టించుకోకుండా, తమ కడుపులు నిండాలని అందరూ దోచుకునే పనిలో నిమగ్నమైపోయారని ఆరోపించారు. వెంటనే అంకంపాలెం అడవి నుంచి ములకలపల్లి వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేకపోతే రోడ్డుపై ధర్నాకు సిద్ధం అవుతామని మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !