ముఖ్యమంత్రి సహాయనిధికి 120 దరఖాస్తులు అందజేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 22: అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్వీకరించిన 120 దరఖాస్తులను బుధవారం సంబంధిత అధికారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉపశమనాన్ని పొందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా, వైద్య చికిత్స అవసరమున్న ప్రతి అర్హత కలిగిన కుటుంబం తమ వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అందజేయాలని, వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సహాయం అందేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.









