+91 95819 05907

అధిక వర్షాలతో నష్టపోయినపత్తి పెసర వరి పండించిన రైతులను ఆదుకోవాలి :సిపిఎం

అధిక వర్షాలతో నష్టపోయినపత్తి పెసర వరి పండించిన రైతులను ఆదుకోవాలి _సిపిఎం
___
మడుపల్లి గోపాలరావు* సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

సిపిఎం చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో నష్టపోయిన పంటలను రేపల్లెవాడ పాతర్లపాడు గ్రామాల్లో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం మధుర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ఖమ్మం జిల్లాలో అధిక వర్షపాతం వలన రైతులు పండించిన పంటలు పెసర పత్తి వరి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు దిగుబడి రాని పరిస్థితి నెలకొని ఉందని ఎకరా పత్తి కేవలం రెండు మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుందని ఒక్కో ఎకరానికి రైతులు పెట్టుబడి 20వేల నుండి 30 వేల రూపాయలు పెట్టి తీవ్రంగా నష్టపోయి పత్తి రైతులు ఉన్నారని వరి పంట కూడా చింతకాని మండలం మధిర నియోజకవర్గం లో ఎండు తెగులు వచ్చి వరి పంట కూడా తీవ్ర నష్టం వాటిలిందని దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు తెలిపారని వర్షాకాలంలో పెసర పంట కూడా రైతులకి చేతికి రాకుండా మొత్తం నేలపాలు అయిందని మొత్తం ఈ సంవత్సర కాలంలో రైతాంగానికి అప్పులు తప్ప ఏమి మిగలలేదు పంట చేతికి రాలేదు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందిస్తే రైతు కొంతమేర అప్పుల నుండి బయటపడే అవకాశం ఉందని కౌలుకి తీసుకున్న రైతులు ఉన్నారు వారికి పెట్టుబడి నష్టం తో పాటు కవులు నష్టం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించి నష్టపోయిన పంటలను సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ సిసిఐ ద్వారా డిమాండ్ చేశారు పత్తిని కొనుగోలు వెంటనే ప్రారంభించాలని ప్రారంభించిన చోట అనేక షరతులు మిల్లులు విధిస్తున్నాయని ప్రభుత్వం స్లాట్ బుకింగ్ చేస్తా ఉంది వాళ్ళు చెప్పినప్పుడే పత్తి తీసుకొని రావాలి తేమ ఉంటే మేము తీసుకోము అని ఒక మిల్లులో పత్తి గనుక తీసుకోపోతే మరి ఏమిల్లుకు తీసుకో పోయే అవకాశం లేకుండా ఆన్లైన్ సిస్టన్ని చేస్తామన్నారు ఇది పత్తి రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అని తెలియజేశారు రైతులకు నష్టపరిహారం అందించే వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించబోతున్నాం తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడించి రైతాంగం తరపున నిరసనని తెలియజేస్తామని ఆయన చెప్పారు… ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రాచబంటి రాము. మండల నాయకులు వత్సవాయి జానకి.రాములు. రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మడిపల్లి కిరణ బాబు.కొత్తపల్లి వెంకటేశ్వర్లు. పార్టీ నాయకులు గడ్డం కోటేశ్వరరావు.నున్న రామకోటయ్య.మండేపూడి కృష్ణయ్య.తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !