కిసాన్ కపాస్ యాప్ పై అవగాహన సదస్సును
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో కిసాన్ క పాస్ యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు(మధిర) స్వర్ణ విజయ చంద్ర మాట్లాడుతూ రైతులందరు ఈ సీసన్ నుంచి పత్తిని సీసిఐ కేంద్రాలలో అమ్మాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కపాస్ కిసాన్ అనే మొబైల్ యాప్ లో నమోదు చేసుకోవాలి అని మరియు ఈ యాప్ లో రైతు యొక్క మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకోని, జిన్నింగ్ మిల్లులకు నిర్దేశించిన తేదీకి పత్తిని తీసుకువెళ్లి విక్రయించుకోవాలి అని తెలిపారు. కావున పత్తి పంట వేసుకున్న రైతులందరు మీ మీ సంబంధిత ఏఈవోలు దగ్గరికి వెళ్లి పంట నమోదు వెబ్సైటులో మీ యొక్క మైబైల్ నంబర్ సరిగ్గా వుందో లేదో చూసుకోవాలని లేని యెడల మీ మొబైల్ నంబర్ సరిచేసుకోవాలి అని సూచించినారు.మొబైల్ నంబర్ సరిగ్గా లేకపోతే పత్తి సీసీఐ లో అమ్ముకోవడం కుదరదు కాబట్టి పత్తి రైతులందరు మీ మీ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గరికి వెళ్లి మొబైల్ నంబర్ సరిచేసుకోవాలి అని సూచించినారు తెలియపరిచినారు .ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, వ్యవసాయ విస్తరణ అధికారులు కార్తీక్, తేజ మరియు పందిలపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.









