+91 95819 05907

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1 లక్ష 60 వేలుగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది :మంత్రి పొంగులేటి ★ఉపాథి హామి పథకం ద్వారా మిగతా 40 వేలు కూడా లబ్ధిదారుల అకౌంట్లో జమ

ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు
-మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్ హెచ్ ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్ లో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి తప్పితే, లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్ మెంట్ వరకూ నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నారు.

ఉపాథి హామి పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాలమొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుంది, ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1 లక్ష 60 వేలుగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.1 లక్ష 60 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.

పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మంత్రి కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !