నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని తాహాసిల్దార్ ఆఫీస్ లో గ్రీన్ వెన్స్ డే లో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు పెద్దమండవ నుంచి ఇసుక రావటానికి పెను భారంగా మారిందని, అధిక వ్యయం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చిన్న మండవ మున్నేరు నుంచి ఇసుక తీసుకెళ్తే లబ్ధిదారులు తక్కువ వ్యయంతో లబ్ధి పొందుతారని కావున ఇసుక తోలేటందుకు ప్రవేట్ రైతులు తమ భూమి నుంచి ఎలాంటి రుసుము లేకుండా ఇవ్వటానికి అంగీకరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చారు అందజేశారు.
ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు కూపన్స్ సకాలంలో అందట్లేదని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ బాబ్జి ప్రసాద్ స్పందించి జిల్లా కలెక్టర్ కి దగ్గరకు మీ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బత్తుల శ్యాంసుందర్, సిలివేరు సైదులు, మండల ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు చాట్ల చంద్రం,ఎస్సీ సెల్ మండల కార్యదర్శి తడికమల్ల రమేష్,శ్రీను, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









