+91 95819 05907

రోడ్ల గుంతలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్, తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్!

రేగా కాంతారావు పిలుపు, మెచ్చా నాగేశ్వరావు ఆదేశాల మేరకు అశ్వారావుపేటలో నిరసన; ప్రజలకు ఇబ్బందులు తొలగించాలంటూ విజ్ఞప్తి

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని గుంతలు పడిన రోడ్లపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదేశానుసారం ఈ నిరసన జరిగింది. బీఆర్‌ఎస్ నాయకులు రోడ్లపై గుంతలను చూపుతూ, తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, నాణ్యమైన రోడ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి వగ్గెల పూజ, అశ్వారావుపేట టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, మాజీ ఎంపీపీ శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, సీనియర్ నాయకులు మందపాటి మోహనరెడ్డి, బజారయ్య, తాళ్ళ సూరి, జుజ్జరపు శ్రీరామ్మూర్తి, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, మాజీ సర్పంచ్, సాధు జోత్స్న, ధర్మ, హుసేన్, నక్క రాంబాబు, రహిమూన్, యువజన నాయకులు మోహన్, చరణ్, అమీర్, రఘురామ్, సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !