నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ప్రతి మంగళవారం రైతు వేదికలలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరియు అధికారులచే రైతులకు సలహాలు సూచనలు ఇవ్వటానికి రైతు నేస్తం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు మరియు అధికారులు అప్పటికప్పుడే సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది 28వ తారీఖున జరగబోయే రైతు నేస్తం కార్యక్రమంలో ప్రతి కొనుగోలు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాపాస్ కిసాన్ యాప్ గురించి మరియు మొక్కజొన్న కొనుగోళ్ల గురించి రైతులకు వివరించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న పంటల స్థితిగతులు మరియు పురుగులు తెగుళ్ల నివారణ చర్యలు రైతులకు వివరించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వీడియో కాన్ఫరెన్స్ ఉన్న మీ రైతు వేదికలలో హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అని
ఎస్ విజయచంద్ర
సహాయ వ్యవసాయ సంచాలకులు మదిరి డివిజన్ తెలిపారు.









