+91 95819 05907

దమ్మపేట సెంట్రల్ లైటింగ్ పనులపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తనిఖీ – నాణ్యత విషయంలో రాజీపడొద్దు: స్పష్టం

దమ్మపేట సెంట్రల్ లైటింగ్ పనులపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తనిఖీ – నాణ్యత విషయంలో రాజీపడొద్దు: స్పష్టం

నిధులు అధికంగా కేటాయించాం, పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ లైటింగ్ పనులను నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం నాడు ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతి, వినియోగిస్తున్న సామగ్రి నాణ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ పనులు వేగంగా పూర్తయితే మండల కేంద్రం మరింత అందంగా సురక్షితంగా మారుతుందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పనుల కోసం ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని కాబట్టి నాణ్యతతో కూడిన పనులు చేయడం చాలా ముఖ్యమని అధికారులకు తెలిపారు. పనులలో ఎక్కడా నిర్లక్ష్యం చూపినా, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు ప్రజల సౌకర్యం కోసమే, పనులు ఆలస్యం కాకుండా, నిర్ణీత గడువులోగా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. పనుల పర్యవేక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రతి దశలోనూ నాణ్యత ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు మరియు కాంట్రాక్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !