రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం:నగరంలోని సువర్ణ యంత్ర సహిత శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేంద్ర, నూతన శివాలయ నిర్మాణ కమిటీ బాధ్యులతో కలిసి.. ప్రాంగణంలో కలియ తిరిగి నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28









