*బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*,రోడ్ల మరమ్మత్తుల నిర్వహణలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమయిందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ , మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు కాంతారావు పిలుపుమేరకు మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులందరితో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుంతలు పడ్డ రోడ్డులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి నోచుకోవడం లేదని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోసిన రోడ్లు తప్ప కొత్తగా ఈ 22నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోడ్డు పోసిన దాఖలాలు లేవని.గత ప్రభుత్వంలో మంజూరై మొదలుపెట్టిన పనులు సైతం సగంలోనే వదిలేశారని అన్నారు. వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడుతాయనీ వాటిని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వనిధైన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రజలకు,ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు చేయకపోయినా అధికారులైన స్పందించి గుంతల మయమైన రహదారులను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టి సెల్ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, పార్టీ సీనియర్ నాయకులు వట్టం రవి, గడ్డం వీరన్న, కుంజ సుధాకర్, ఇర్ఫా వెంకటయ్య, బొమ్మెర్ల సతీష్, కల్తీ లింగయ్య, జీవన్, కులదీప్, జాడి శ్రీను, కుంజా రవి తదితరులు పాల్గొన్నారు









