ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.
నేటి గదర్ కరకగూడెం: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, బాణాసంచ కాల్చి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్ మరియు మాజీ సర్పంచ్, నియోజకవర్గ నాయకులు పోలేబోయిన శ్రీవాణి,తిరుపతయ్య
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ,రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటు,పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సేవలందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









