+91 95819 05907

తుపాను తీరం దాటిందా? అంటే ఏమిటి?,మీకు తెలుసుకోవాలని ఉందా?ఐతే ఇది చదువండి!

తుపాను ఫలానా చోట తీరం దాటిందని వాతావరణశాఖ ప్రకటిస్తుంది. కానీ అక్కడ ఎలాంటి గాలి, వాన ఉండదు. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. తీరం దాటిందా? అని అక్కడున్నవారే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది తుపాను కేంద్ర స్థానం (కన్ను). అక్కడ ఎలాంటి అలజడి ఉండదు. కేంద్ర స్థానం తర్వాత నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అలజడి అధికంగా ఉంటుంది. అందుకే తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలులు వీస్తాయి. తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. తర్వాత కొద్ది సేపటికి మళ్లీ విలయం మొదలవుతుంది. తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అది తుపాను, తీవ్ర తుపానుగా మారి తీరం దాటే వరకు ఎన్నో దశలు. కొన్ని అల్పపీడనం దశలో, మరికొన్ని వాయుగుండాలకే పరిమితమవుతాయి. కొన్ని బలపడి తుపాను, తీవ్ర తుపాన్లుగా తీరం దాటి నేలపైకి వస్తాయి తుపాను గమనంలో కీలకం కేంద్ర స్థానమే. తుపాను తీవ్రతకు అనుగుణంగా దీని విస్తృతి పెరుగుతుంది. శక్తిమంతమైన తుపాను కేంద్రంలో ఉండే ప్రాంతాన్ని కన్ను (ఐ) అంటారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి నెమ్మదిగా వీస్తుంది. అసలు ఉండకపోవచ్చు. వర్షం ఉండదు. కన్ను చుట్టూ ఉండే వలయాకారాన్ని కంటి గోడలు (ఐ వాల్స్)గా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సుడిగుండాలతో అల్పపీడనం ఏర్పడుతుంది. తర్వాత వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తుపానుగా బలపడిన తర్వాత కేంద్ర స్థానం (కన్ను) స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర తుపాను అయితే మరింత పెద్దగా కనిపిస్తుంది. కేంద్ర స్థానం విస్తృతి 10 నుంచి 20 కి.మీ వరకు ఉండొచ్చు. తర్వాత కంటి గోడల విస్తృతి అంటే తుపాను కేంద్ర స్థానం నుంచి 225 కి.మీ. వరకు ఉండే అవకాశం ఉంది. తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్లడం అరుదే. సాధారణంగా తుపాన్లు తీరాన్ని తాకితే బలహీనపడతాయి. కానీ 2022 మే నెలలో ఏర్పడిన అసని తుపాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరాన్ని దాటి, వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్లీ కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లింది. 1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో తీరం తాకిన తుపాను కంటి విస్తృతి 425 కి.మీ. అంటే కేంద్ర స్థానం నుంచి 425 కి.మీ. విస్తృతిలో ప్రభావం చూపింది. భారత తీరంలో ఇదో రికార్డు. హుద్ హుద్ విస్తృతి 44-66 కి.మీ.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !