నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందువలన ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలను పాటించాలని పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, కాలువలు నదుల వద్దకు వెళ్ళవద్దని అలాగే వాటిని దాటే ప్రయత్నం చెయ్యొద్దని. రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేటప్పుడు చూసుకొని వెళ్లాలని కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని. ప్రవహిస్తున్న నీటిలో నుండి వాహనాలను నడిపే ప్రయత్నం చేయవద్దని అలా ప్రయత్నం చేసి ప్రాణాలు మీదుకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
Post Views: 22









