*యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి*
నేటి గదర్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం అనే చైతన్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మణుగూరు డిఎస్సీ హాజరై మాట్లాడుతూ అసలు డ్రగ్స్ అంటే ఏమిటి డ్రగ్స్ సేవించడం వలన జరిగే అనర్ధాలు దాని వలన సమాజానికి, వాళ్ల కుటుంబాలకు జరిగే చెడు గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే మంచి ఆడవాడిక ప్రవర్తన కలిగి ఉండాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. మీరు ఉన్నంత స్థాయికి ఎదగాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే ఒక విద్యని అభ్యసించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు,
కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరావు, ప్రధానోపాధ్యాయులు తాటి.రామచంద్రయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.









