మున్నేరు వరదలుకు బయపడకండి. మేమున్నాం.
ఖమ్మం కలెక్టర్ అనుదీప్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఎగువ జిల్లాలో మున్నేరు పరీవాహకంలో భారీ వర్షం కురవడంతో మున్నేరు మూడవ ప్రమాద హెచ్చరిక తో 25 అడుగుల మేరకు ఖమ్మం కాల్వొడ్డు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు ప్రవాహాన్ని జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. మున్నేటికి ఇరువైపులా అప్రమత్తం చేయించి, ప్రమాద హెచ్చ రిక జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ధంసలాపురం పాఠశాల, నయాబజార్ కళాశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించి, పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు వాహనాల్లో తరలించి, నెమ్మదిగా పెరుగుతున్న మున్నేరు నీటిమట్టం ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.









