రియాజ్‌ను వెతికే ప్రక్రియలో తన భార్య, తల్లిపై లైంగిక దాడి చేశారు.. ప్రైవేట్ భాగాల్లో కారం పొడి చల్లారు!
రియాజ్ మైనర్ పిల్లలను తలకిందులుగా వేలాడదీసి, వారి దుస్తుల్లోకి బల్లులు, కప్పలను వదిలి చిత్రహింసలు పెట్టారు!
రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ
ఒక రాజకీయ నాయకుడి ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టడానికే ఈ ఎన్‌కౌంటర్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపిన కమిటీ సభ్యులు
రియాజ్ మైనర్ పిల్లల కళ్లల్లో కూడా కారంపొడి చల్లారని నిర్ధారించారు
కస్టడీలో రియాజ్ చనిపోయాక, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి, తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు కట్టు కథ సృష్టించారని ఆరోపణలు
ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టిన సంచలన విషయాలు👇
రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు, ఆ పనిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీ జప్తు చేశాడు
ఆ స్కూటీలో రియాజ్‌కు 3 లక్షల రూపాయలు దొరికాయి, తీరా చూస్తే అవి ఫేక్ నోట్లు అని తెలుసుకున్నాడు
ఫేక్ నోట్లను పలువురికి ఇచ్చి UPI ద్వారా నగదు బదిలీ చేయించుకుని, ఆ డబ్బును ఖర్చు చేశాడు
ఒకరోజు ఆసిఫ్ వచ్చి తన బండి, 3 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు
రియాజ్‌కు ఏం చేయాలో తెలియక.. ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్‌ను సంప్రదించి కాపాడమని వేడుకున్నాడు
ప్రమోద్, రియాజ్‌ను ఒక ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లగా, అతను రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు
తాను అంత డబ్బు ఇవ్వలేనని రియాజ్ చెప్పడంతో.. రియాజ్‌ను ఎరగా వేసి ఫేక్ నోట్ల స్కామ్ బయటపెట్టాలని నిర్ణయించిన పోలీసులు
ఇదంతా గ్రహించి పారిపోయిన ఆసిఫ్
రియాజ్ ఇన్‌ఫార్మర్‌గా మారాడని అనుమానంతో, అతన్ని చంపేందుకు నిర్ణయించుకున్న ఆసిఫ్ గ్యాంగ్
దీంతో రూ.1 లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుండి కాపాడతామని రియాజ్‌కు తెలిపిన పోలీసులు
స్థానికుల సమాచారం ప్రకారం అక్టోబర్ 17వ తేదీన రియాజ్, ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా రహస్యంగా కలుసుకుని, లంచం గురించి చర్చించుకున్నారు
రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ రహస్యంగా కలుసుకున్న విషయం తెలిసి, రియాజ్‌ను చంపేందుకు వచ్చిన ఆసిఫ్ గ్యాంగ్
ఆసిఫ్ గ్యాంగ్ దాడి నుండి రియాజ్ తప్పించుకున్నాడు, కానీ కానిస్టేబుల్ మృతి చెందాడు
చిన్న గాయంతో ఉన్న ఆసిఫ్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు తరలించారు అనేది సందేహాలకు తావిస్తుంది
ఎలాంటి విచారణ లేకుండా కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ చంపాడని పోలీసులు నిర్ధారించారు
ప్రమోద్ మృతదేహం వీడియోలు, ఫోటోలు కూడా పోలీసులు తీయలేదు
రియాజ్ కోసం వెతికే క్రమంలో అతని భార్య, తల్లి, ఇద్దరు మైనర్ పిల్లలను రెండు రోజులు అక్రమంగా స్టేషన్లో నిర్బంధించారు
అతని భార్య, తల్లిపై పోలీసులు లైంగిక దాడులు చేశారు, ప్రైవేట్ భాగాల్లో కారంపొడి చల్లారు
రియాజ్ పట్టుబడ్డాక కోర్టులో హాజరు పరచకుండా నేరుగా అరెస్టు చేసి అతన్ని చిత్రహింసలు పెట్టారు
థర్డ్ డిగ్రీ చేయడంతో రియాజ్ కస్టడీలోనే చనిపోయాడు
చనిపోయిన రియాజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, తప్పించుకోబోతే ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు అబద్ధాలు చెప్తున్నారు
రియాజ్ స్కూటీ, హత్య చేసిన ఆయుధం లాంటి ఆధారాలు ఏవీ పోలీసులు ప్రవేశపెట్టలేదు
కాల్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ లాంటివన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయి
ఈ ఎన్‌కౌంటర్ కచ్చితంగా ఒక కస్టొడియల్ డెత్ కవర్ చేసే బూటకం మాత్రమే
రాహుల్ గాంధీ అన్ని మతాల ప్రజలు ఒకటే అని చెప్తుంటే.. తెలంగాణలో దానికి విరుద్ధంగా పాలన జరుగుతుంది
ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టేందుకే ఈ ఎన్కౌంటర్ నాటకం ఆడినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి
దీనిపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని హైకోర్టు న్యాయమూర్తిని అడుగుతాము









