కేటీఆర్ రోడ్ షో జనసంద్రం💥💥💥
హైదరాబాద్:జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించి బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ శ్రీ కేటీఆర్ గారు శుక్రవారం సాయంత్రం షేక్ పేట నుంచి రోడ్డు షో తో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు హాజరయ్యారు.
శ్రీ కేటీఆర్ గారు తన మార్క్ ప్రసంగంతో కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు.
ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని పాలకులను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
తొలి రోజు కేటీఆర్ రోడ్డు షో కి భారీగా ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.
Post Views: 65









