రామా కృష్ణ పురంలో ఏకలవుడి 15 వ వార్షికోత్సవం
ఎరుకుల కులాన్ని చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ.
– నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల పరిధిలోని రామ కృష్ణ పురం గ్రామంలో ఏకలవుడి విగ్రహం ఏర్పాటు చేసి నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామంలో ఎరకల కులస్తులు వార్షికోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు పాలకుర్తి కృష్ణ పాల్గొని ఏకలవుడి సేవల గురించి కొనియాడారు.ఎరుకుల కులస్థులకు గుర్తింపు లేకుండా పోయింది అని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అని ప్రభుత్వ పెద్దలు ఎరుకుల కులం కోసం ప్రత్యకమైన రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వ పెద్దలు భట్టి విక్రమార్క చొరవ తీసుకుని ఎరుకుల కులం కి రిజర్వేషన్ లో మంచి అవకాశాలు ఇవ్వాలని కోరారు.తర్వాత విగ్రహం కి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఏకలవ్యుడుకి జై కుర్రు జై జై కుర్రు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి భద్రయ్య ,నాగభూషణం,మరియు ఏకలవ్య మండల కమిటీ,గ్రామ కమిటీ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.









