+91 95819 05907

తుఫాన్ బాధిత రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి : సిపిఎం పార్టీ డిమాండ్.

నేటి గదర్ న్యూస్, వైరా:
ఇటీవల తుఫాను ప్రభావం వల్ల నష్టం జరిగిన బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సిపిఎం వైరా డివిజన్ నాయకులు టాటా నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వైరా మండలం పరిధిలోని అష్ట గుర్తి, గొల్లినపాడు గ్రామాల్లో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను సిపిఎం వైరా రూరల్ బృందం పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరావు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు తీరా పంటకు చేతికి వచ్చే సమయానికి తుఫాను వల్ల పంటలకు అపార నష్టం వాటిల్లి రైతులకు తీరని అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగిన పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల నష్ట పరిహారం అపార పంట పంట నష్టం జరిగిన రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని అన్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 రూపాయలు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. తడిసిన ప్రత్తి,వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వైరా మండల కమిటీ సభ్యులు చిత్తూరు నాగరాజు, చిత్తూరు లక్ష్మణ్, కిలారి శ్రీనివాసరావు, శ్రీరామనేని వెంకటేశ్వరరావు, ఆళ్ల శ్రీనివాసరావు, రైతులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !