*ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కోరం సీతారాములు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలంలో రైతులు పండించిన పంటలన్నిటికీ గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా నాయకులు కొరం సీతారాములు, బచ్చల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తాసిల్దార్ షేక్ మహమ్మద్ కాసిం కు వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ 20 రోజుల కిందట నుండి మొక్కజొన్న పంట రైతుల వద్ద ఉన్న ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిందని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులు రైతుల వద్ద నుండి తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. మొక్కజొన్న కింటాకు 2400 రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం లాలయ్య, ముక్తి సత్యం, వై వెంకన్న, ఈసం మంగన్న, పెంటన్న, ఈసం కృష్ణ, ఎల్లన్న, మల్లేష్, పరిశిక రవి, మానాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు









