పేద కళాకారుడికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన ప్రజా కళాకారులు మోదుగు గోవిందరావు కు ఈ మధ్యకాలంలో వైరా వైష్ణవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతులు కాళ్లకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి.పేద కళాకారుడికి బోడెపూడి విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో సిపిఎం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, మండల నాయకులు బాజోజి రమణ, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, రుద్రాక్షమాల నరసింహ చారి, సిపిఎం పాలడుగు గ్రామ కార్యదర్శి మజీద్ బి, షేక్ రెహానా,యన్, శంకరయ్య,షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26









