మణుగూరు ఘటనకు బి ఆర్ స్ శ్రేణులు దిగ్బ్రాంతి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.
మణుగూరు ఘటన ద్వారా కాంగ్రెస్ నీచ సంస్కృతిని 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లింది.
రేగా కాంతారావు ప్రయివేటు
ప్రాపర్టీని కొనుగోలు చేసి,అందులోనే నివాసం ఉంటూ, సగభాగాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారు.
కొంతమంది కాంగ్రెస్ గూండాలు మణుగూరు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడికి తెగబడి ఫర్నీచర్ ను తగులబెట్టారు,మా కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు.
నిన్న సర్వే రిపోర్టులతో కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగింది.
బీఆర్ఎస్ గద్దెపై కాంగ్రెస్
జెండాను పెట్టారు.
మనం తెలంగాణలో ఉన్నామా
లేక వేరే దేశంలో ఉన్నామా…?
కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై
కాంగ్రెస్ వాళ్లు దాడి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్యూర్ అయ్యారు.
సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ క్యాంపు ఆఫీసుపై,సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై, భువనగిరిలో పార్టీ కార్యాలయంపై దాడులు చేశారు.
గాంధీ భవన్ సంస్కృతిని తెలంగాణ మొత్తం చూపెడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేర్పుతున్నది ఇదేనా?
బీఆర్ఎస్ కార్యాలయంపై
దాడి చేసిన వారిపై డీజీపీ శివధర్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి.
శాంతియుతంగా ఉన్న
ఖమ్మం జిల్లాలో అలజడి సృష్టిస్తున్నారు.
భువనగిరి బీఆర్ఎస్
ఆఫీసును ధ్వంసం చేశారు.
సీపీఏం రాష్ట్ర నాయకుడు రామారావు హత్యకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ బలంగా వాదనలు వినిపిస్తున్నందున జూబ్లీహిల్స్ లో మద్దతు విషయంలో సీపీఏం పునరాలోచన చేసుకోవాలి.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా కూడా బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది, కేసీఆర్ కు బహుమతిగా ఇస్తాం
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడులు చేశారు.
…ఎమ్మెల్సీ తాతా మధు….
కాంగ్రెస్ రౌడీ మూకలు,గూండాలు బిఆర్ఎస్ మణుగూరు ఆఫీసుపై దాడి చేశారు.
ఫర్నిచర్ ను బజారులో తగలపెడుతుంటే మణుగూరు పోలీసులు గడ్డి పీకుతున్నారా.
మణుగూరు పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారా…?
సీపీఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావును గూండాలు హత్య చేశారు
సిరిసిల్ల,సిద్దిపేట క్యాంపు కార్యాలయాలపై,భువనగిరి బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడులు చేశారు
బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ మీ
ఉడత ఊపులకు భయపడం.
రేగా కాంతారావు మణుగూరు బిఆర్ఎస్ ఆఫీసును హరికృష్ణ
అనే వ్యక్తి దగ్గర కొనుక్కున్నారు.
మణుగూరు బిఆర్ఎస్
కార్యాలయం మీ అయ్య జాగీరా…?
2009 లో ఎమ్మెల్యే అయిన తర్వాత రేగా కాంతారావు స్వంత డబ్బుతో ఆఫీసును ఏర్పాటు చేశారు.
మణుగూరు కార్యాలయాన్ని
కాంగ్రెస్ పార్టీ కట్టించిందా…?
గతంలో పశ్చిమ బెంగాల్ లో సీపీఎం ఆఫీసులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ కార్యాలయాలపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్నారు.
డి.ఎం.ఎఫ్.టి నిధులు ఏమయ్యాయని అడిగినందుకు
రేగా కాంతారావును టార్గెట్ చేసి ఆఫీసుపై దాడి చేశారు.
పార్టీ కార్యాలయంపై దాడులు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడతారా?
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అసలు పని చేస్తుందా లేదా?
పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేస్తున్నదా?
బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా రక్షించుకోవాలో కార్యకర్తలకు
తెలుసు.బిఆర్ఎస్ కార్యాలయాలు,
నాయకులపై దాడులు చేసిన వారిని ఉపేక్షించబోమని,
అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం.
దాడి చేసిన కాంగ్రెస్
గూండాలపై చర్యలు
తీసుకోవాలి.
మణుగూరు బీఆర్ఎస్
కార్యాలయం ప్రయివేటు ప్రాపర్టీ.
డాక్యుమెంట్లు తీసుకుని
రావడానికి,చర్చకు సిద్ధంగా ఉన్నారా?
ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు దిండిగాల రాజేందర్ ,బెల్లం వేణు,ఎం.రాజాగౌడ్,మల్లెల రవిచంద్రలు పాల్గొన్నారు









